ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలం కోనయ్యగూడెంలో సర్వే నెంబర్ 73, 74, 75 లలో ప్రభుత్వ భూములను దళితులకు 14 కుంటలు చొప్పున గత ప్రభుత్వం పంపిణీ చేసింది. కుటుంబ యజమానులు చనిపోవడం.. వర్షాలు సరిగా పడకపోవడంతో కొన్ని రోజులు ఆ భూమిని సాగు చేయకుండా వదిలేశారు. ప్రస్తుత పాలకవర్గం సభ్యులు ఆ భూమిలోనే వైకుంఠధామం నిర్మించాలని నిర్మాణం పనులు చేపట్టారు.
ఆ పనులు నిలిపివేయాలని దళితుల భూములు దళితులకు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమార్పీఎస్ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు మహిళలు వినతిపత్రం అందించారు. తహసీల్దార్ స్పందించి దళితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండీ: జాతీయ రహదారి సర్వే పనులను అడ్డుకున్న రైతులు.. కారణమిదే..