ETV Bharat / state

పేదలకు ఎమ్మెల్యే సండ్ర నిత్యావసరాల పంపిణీ - ఖమ్మం జిల్లా సత్తుపల్లి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 200మంది పేదలకు నిత్యావసరాలను ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య దాతల సాయంతో పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకోవడానికి సహృదయంతో ముందుకొస్తున్న వారిని ఆయన అభినందించారు.

daily essentials distributed to the poor by mla sandra venkata veeraih in khammam
పేదలకు ఎమ్మెల్యే సండ్ర నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 16, 2020, 3:25 PM IST

కరోనా నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పేదలకు.. దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తల్లాడ మండలం నారాయణపురంలో దాతల సహకారంతో 200 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.

పేదలు, వలస కూలీలు, వీధి బాలలను సహృదయంతో దాతలు ఆదుకోవాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా పనులు లేక అవస్థలు పడుతున్న నాయిబ్రాహ్మణులు, వికలాంగులు, యాచకులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 కొన్నిచోట్ల ఖాతాల్లో జమ అయినా బ్యాంకు సిబ్బంది వాటిని ఖాతాదారుల అప్పుల్లో జమ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని.. అలాంటి వాటికి తావులేకుండా ఎమ్మెల్యే చూసుకోవాలని అధికారులు ఆదేశించారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.