కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. అయితే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో ప్రజా సమస్యలపై నాయకులు
లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ నిరసన ప్రదర్శన చేస్తే కేసులు పెట్టడం సరికాదన్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
"కరోనా కట్టడిలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కలుపుకొని పోవడం లేదు. ప్రభత్వ లోపాలపై ఆందోళనలు చేస్తే కేసులు పెడుతున్నారు. సీపీఎం కార్యకర్తలపై కేసులు ఉపసంహరించుకోవాలి. పేదల ఆకలి తీర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఆకలితో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.7 వేలు కేటాయించాలి. ఉపాధిహామీని వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు అనుసంధానించాలి."
-తమ్మినేని వీరభధ్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !