ఖమ్మం జిల్లా కారేపల్లిలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సీపీఎంఆధ్వర్యంలో టాక్టర్లు, ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర రాకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు.
పలు రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వీరభద్రం సత్యనారాయణ, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ