దేశవ్యాప్తంగా ప్రజలు కొవిడ్ బారినపడి మృత్యువాత పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) నాయకులు ఆరోపించారు. వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ... ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. .
స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు రుణాలు రద్దుచేసి పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. భారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కరోనా భయాలున్నా తగ్గుతున్న నిరుద్యోగ రేటు