ETV Bharat / state

మంత్రిగారూ.. మీకోసం బ్యానర్లు పెడితే చించేస్తారా..? - మాజీ శాసనసభ్యుడు జగన్​ వెంకటరావు తాజా వార్తలు

ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్​లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​కు స్వాగతం పలుకుతూ మాజీ శాసనసభ్యుడు జలగం​ వెంకటరావు వర్గీయులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఆకతాయిలు వాటిని చింపివేయటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి స్వాగతం పలకడం కొందరికి మాత్రమే పరిమితమా అని ప్రశ్నించారు.

controversy-in-banners-holding-of-minister-puvvada-ajay-kumar
బ్యానర్ల విషయంలో వివాదం
author img

By

Published : Jun 18, 2020, 5:42 PM IST

ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్​లో పువ్వాడ అజయ్​కుమార్ పర్యటన సందర్భంగా మాజీ శాసనసభ్యుడు జగన్​ వెంకటరావు వర్గీయులు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​కి స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఆకతాయిలు కావాలనే వాటిని చింపివేశారని వెంకటరావు అభిమానులు ఆరోపిస్తున్నారు. సుజాతనగర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆగ్రహించిన జలగం​ వెంకటరావు వర్గీయులు మంత్రి అజయ్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. మీకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టే అవకాశం కేవలం కొందరికి మాత్రమే పరిమితమా అంటూ వారు ప్రశ్నించగా... మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు.

ఇదీ చూడండి : వేదాద్రి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.