తెలంగాణ ప్రజలను మోసం చేసిన తెరాసకు తగిన బుద్దిచెప్పాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ కోరారు. ఖమ్మం పట్టణ కేేంద్రంలో లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ నేత వి. హనుమంతరావు సంభాని చంద్రశేఖర్, దీపక్ చౌదరిలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకర్స్‌ను కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.
పట్టభద్రుల ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గడిచిన ఆరేళ్లలో ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేకపోయారని రాములు నాయక్ విమర్శించారు. పీఆర్సీ విషయంలో కేసీఆర్ మరోసారి ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే ఉద్యోగులకు మంచి పీఆర్సీ వస్తుందని అన్నారు. జనరల్ స్థానంలో గిరిజన నేతకు సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు అండగా ఉండాలని వీహెచ్ కోరారు.
ఇదీ చదవండి: 'తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీజీపీఏ మద్ధతు'