ETV Bharat / state

మోటర్‌ సైకిల్‌పై కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ - District Collector RV Karnan abruptly checks on second phase of village development

మోటర్‌ సైకిల్‌పై ఓ జిల్లా కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులను రెండో విడత పల్లె ప్రగతి పనుల గురించి ఆరా తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

Collector's sudden check on motorcycle at khammam paleru
మోటర్‌ సైకిల్‌పై కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Jan 8, 2020, 12:08 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని పలు గ్రామాలలో రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్​ ఆర్‌.వి.కర్ణన్‌ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నాయకన్‌గూడెం, లింగారం తండా గ్రామాలను పరిశీలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వల్ల కలెక్టర్‌ మోటర్‌ సైకిల్​ నడుపుతూ గన్యగండాకు చేరుకొని గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు.

గ్రామంలో పరిస్థితుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకం, రోడ్ల శుభ్రత, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మోటర్‌ సైకిల్‌పై కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

ఇదీ చూడండి : 'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.