ETV Bharat / state

ఎకరానికి రూ.10 వేల పరిహారం: సీఎం కేసీఆర్​

CM KCR Announced Compensation for Crop Loss : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపబోమని.. ఇంతకముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఏ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలోని రైతులెవరూ నిరాశ చెందొద్దని.. ఎకరానికి రూ.10 చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

CM KCR
CM KCR
author img

By

Published : Mar 23, 2023, 1:42 PM IST

Updated : Mar 23, 2023, 1:58 PM IST

CM KCR Announced Compensation for Crop Loss : ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు భరోసా ఇవ్వడానికి, నష్టం అంచనా వేసేందుకు సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం.. ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్‌ మండలంలోని రావినూతల గ్రామానికి చేరుకున్నారు.

అక్కడ నష్టపోయిన పంటలను పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే.. 20 ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నదాతలు వివరించారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని కోరారు.

నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్‌ భరోసానిచ్చారు. కేంద్రం రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదని.. అందుకే ఈసారి నివేదిక పంపబోమని సీఎం స్పష్టం చేశారు. రైతులెవరూ నిరాశ చెందవద్దని.. ఎకరానికి రూ.10 వేల పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవన్న కేసీఆర్​.. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరమని వ్యాఖ్యానించారు.

"రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్‌ వన్‌.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు. కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం. నయా పైసా ఇవ్వలేదు. నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించడం లేదు. రైతులు నిరాశ చెందవద్దు. కౌలు రైతులను ఆదుకునే ఆదేశాలు ఇస్తాం. ఎకరానికి రూ.10 వేలు పరిహారం. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం. దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవు. ఇప్పుడున్న కేంద్ర విధానం ప్రకారం రైతులకు ఏమీరాదు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాం. కొత్త ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేశాం". - సీఎం కేసీఆర్‌

ఖమ్మం పర్యటన ముగించుకున్న కేసీఆర్ మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలానికి చేరుకున్నారు. ఈ మండలంలోని రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో సీఎం సంభాషించనున్నారు. అక్కడి నుంచి వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని అడవి రంగాపురం గ్రామాన్ని సందర్శిస్తారు.

పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడతారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రామచంద్రాపూర్‌ గ్రామానికి వెళ్లి పంటలను పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. తిరిగి సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకుంటారు. పంట నష్టంపై ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేపట్టింది. సీఎం క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఎకరానికి రూ.10 వేల పరిహారం: సీఎం కేసీఆర్​

ఇవీ చదవండి:

ఆగం చేసిన అకాల వర్షాలు.. పరిహారంపైనే అన్నదాతల ఆశలు..

పంట నష్టం అంచనాకు వ్యవసాయ శాఖ ని'బంధనాలు'

నిండాముంచిన అకాల వర్షాలు: అన్నదాతలకు 'చేదు' మాత్రమే మిగిలింది..

Last Updated : Mar 23, 2023, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.