తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. వేడుకలను పార్టీ నేతలు, గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అటు సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర, కూసుమంచిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ కమల్‌రాజు ముదిగొండలో మొక్కలు నాటగా.. డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగ భూషయ్య ఖమ్మం 8వ డివిజన్లో మొక్కలు నాటారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని.. బంగారు తెలంగాణ చేసే లక్ష్యంతో ముందుకెళ్తోన్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ మా తండ్రి కావడం అదృష్టం: కేటీఆర్, కవిత