ETV Bharat / state

బాలికకు ప్రభుత్వపరంగా ప్లాస్టిక్​ సర్జరీ చేయించాలి: భట్టి - భట్టి విక్రమార్క తాజా వార్తలు ఖమ్మం

ఖమ్మంలో 13 ఏళ్ల బాలికపై దుర్మార్గంగా ప్రవర్తించిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బాధితురాలి నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క.. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని.. ప్రభుత్వ పరంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని ప్రభుత్నాన్ని కోరారు.

బాలికకు ప్రభుత్వపరంగా ప్లాస్టిక్​ సర్జరీ చేయించాలి: భట్టిబాలికకు ప్రభుత్వపరంగా ప్లాస్టిక్​ సర్జరీ చేయించాలి: భట్టి
బాలికకు ప్రభుత్వపరంగా ప్లాస్టిక్​ సర్జరీ చేయించాలి: భట్టి
author img

By

Published : Oct 6, 2020, 8:39 PM IST

ఖమ్మంలో 13 ఏళ్ల బాలికపై దుర్మార్గంగా ప్రవర్తించిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క.. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలికపై పైశాచికంగా ప్రవర్తించడం హృదయవిదారకమన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని కోరారు.

బాలిక తొందరగా కోలుకుని తల్లిదండ్రుల వద్దకు చేరాలని భట్టి ఆకాంక్షించారు. తప్పనిసరిగా దోషుల్ని కఠినంగా శిక్షించాలని.. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: అమానుషం: బాలికపై పైశాచికం.. హత్యాచారయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.