ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేని స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి మాట విని పత్తి, మిరప, వరిని రైతులు సాగు చేశారని పేర్కొన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలని ఆయన కోరారు. వరి ధాన్యాన్ని క్వింటాకి రూ.2,500 చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ఈనెల 11న రైతులకు మద్దతు ధర కోసం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు.
ఇదీ చదవండి: వీడియో: యువతితో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై దాడి