తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వైరా, ఏన్కూరులలో ప్రభుత్వం మంజూరు చేసిన క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు పంపిణీ చేశారు. పండుగపూట సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్మస్, హిందువులకు బతకమ్మ ఉత్సవాలకు ప్రభుత్వం చేయూతనందిస్తోందని అన్నారు. క్రైస్తవులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు'