ETV Bharat / state

మిర్చి మార్కెట్‌లో అన్నదాతలకు దక్కని గిట్టుబాటు ధర - వ్యాపారుల ఇష్టారాజ్యం

ఏటా అదే తంతు. ప్రతి సీజన్‌లోనూ అదే సీను. కోటి ఆశలతో మార్కెట్‌కు వచ్చిన మిర్చి రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షగానే మిగులుతోంది. అప్పటిదాకా మంచి ధర పలికిన మిర్చి... అన్నదాతలు మార్కెట్‌కు చేరగానే అమాంతం పడిపోతుంది. మొత్తంగా ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అధికారుల ఉదాసీనత, వ్యాపారుల ఇష్టారాజ్యం వెరసి... రైతులకు గిట్టుబాటు ధర ఎండమావిగానే మిగులుతోంది.

chilli-crop-market-prices-issue-in-khammam-market
మిర్చి మార్కెట్‌లో అన్నదాతలకు దక్కని గిట్టుబాటు ధర
author img

By

Published : Feb 14, 2021, 4:15 AM IST

మిర్చి మార్కెట్‌లో అన్నదాతలకు దక్కని గిట్టుబాటు ధర

ఖమ్మం మిర్చి మార్కెట్‌కు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి మిర్చి వస్తుంది. సీజన్ ఆరంభం నుంచి కూలీల కొరత, ప్రకృతి విపత్తులు తట్టుకుని రైతులు పంట సాగు చేశారు. పెట్టుబడి భారీగా పెరిగిపోయింది. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. వచ్చిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు వచ్చిన అన్నదాతలు.... అడుగడుగునా దగా పడుతున్నామని వాపోతున్నారు.

ధరలు తగ్గిపోవడం

ఏటికేడు మార్కెట్‌లో పెరిగిన వ్యాపారుల ఆధిపత్యం ముందు... మిర్చి రైతులు చిన్నబోతున్నారు. వారం రోజులుగా మార్కెట్‌కు మిర్చి రాక గణనీయంగా వస్తుంది. అయితే సీజన్ ఆరంభంలో ఉన్న ధరలు... అమాంతం తగ్గిపోవడం అన్నదాతల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా 21 వేలు పలికిన మిర్చి... క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం గరిష్టంగా 13 వేల 500, కనిష్ట ధర 7 వేలుగా పలుకుతోంది. జెండా పాట నిర్ణయించిన ప్రకారం కూడా ఏ ఒక్క రైతుకు ధర దక్కడం లేదని వాపోతున్నారు. మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతుండటంతో... వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వ్యాపారులు కుమ్మకై

తేమ ఉందని, రంగుమారిందని సాకులు చెబుతూ వ్యాపారులంతా కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. దళారులంతా సిండేకేట్‌గా మారి కొనుగోళ్లు చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో పంటను అప్పగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల మాయాజాలంపై ఇప్పటికైనా మార్కెట్ అధికారులు దృష్టి సారించి.. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : 'మీడీయా వారు పరిశీలించి సీఎంకు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.