ETV Bharat / state

తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీల్లో గెలిచిన 'త్రిమూర్తులు' - టీడీపీ బీఆర్​ఎస్​ కాంగ్రెస్​ పార్టీలో గెలిచినవారు

Candidates won in three parties Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తులు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు వేరు వేరు పార్టీల తరుఫున పోటీ చేసి గెలుపొందారు. వారే తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పాయం వెంకటేశ్వర్లు. వీరు ముగ్గురు నాయకుల ఎన్నికల వివరాల గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Telangana Elections 2023 Records
Candidates won in three parties Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 1:38 PM IST

Updated : Dec 4, 2023, 2:52 PM IST

Candidates Won in Three Parties Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలిచి తమ సత్తా చాటారు. వారే తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పాయం వెంకటేశ్వర్లు. వీరు పోటీ చేసిన మూడు పార్టీల నుంచి విజయకేతనం ఎగురవేశారు.

Thummala Nageswara Rao Won 3 Parties : 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో, 2009, 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఎనిమిది సార్లు బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలుపొందారు. 1983, 1989లో తుమ్మల ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. దీంతో బీఆర్​ఎస్​(టీఆర్ఎస్​) పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

2014లో పాలేరు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా గెలుపొందిన రాంరెడ్డి వెంకట్​రెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్​ అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి ఘన విజయం(Thummala Won as a BRS Candidate) సాధించారు. 2018 ఎన్నికల్లో ఆయన అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన తుమ్మల గెలుపొందారు.

Tummala Nageshwara Rao Rally in Khammam : 1000 కార్లు, 2 వేల బైకులతో తుమ్మలకు ఘన స్వాగతం

Payam Venkateswarlu Won 3 Parties : రద్దైన పినపాక (ఎస్టీ) నియోజకవర్గం నుంచి 2004లో సీపీఐ నుంచి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2009లో అదే స్థానంలో సీపీఐ తరఫునే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పినపాక నుంచి వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.(Payam Venkateswarlu Won from YSRCP) ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్​లో చేరి తర్వాత 2018లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​ టికెట్​ దక్కకపోవడంతో కాంగ్రెస్​లో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. అనంతరం తన ప్రత్యర్థి రేగా కాంతారావుపై ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Jupally Krishna Rao Latest Record : నాగర్​ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004లో కాంగ్రెస్​ తరుఫున మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేసి గెలిచారు. అదే పార్టీ తరఫున 2012లో జరిగిన ఉప ఎన్నికలో నెగ్గారు. అనంతరం బీఆర్ఎస్​లో చేరారు. 2014లో బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్​లో చేరి తాజా ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. రెండు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు.

Ex Minister Jupally Joined Congress : ఎట్టకేలకు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి

Last Updated : Dec 4, 2023, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.