ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి? : బండి సంజయ్ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఖమ్మం అభివృద్ధికి కేంద్రం ఇచ్చినా వందల కోట్లు నిధులు ఎక్కడికి వెళ్లాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో రోడ్​ షోలు నిర్వహించారు.

bjp state president  bandi  sanjay election campaign in khammam
ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న బండి సంజయ్
author img

By

Published : Apr 25, 2021, 5:29 PM IST

అమృత్ పథకం కింద ఖమ్మం కార్పొరేషన్​కు కేంద్రం కోట్ల నిధులిస్తే తెరాస నాయకులు ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు. ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం నిధులిస్తుంటే పథకాల పేర్లు మార్చుకుని తెరాస ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో రోడ్​ షోలు నిర్వహించారు.

ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న బండి సంజయ్

ప్రజలు నిధులు ఇచ్చే పార్టీకి ఓటేస్తే నగరం మరింత అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక్క కార్పొరేటర్ లేకున్నా వందల కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి ప్రజలు గుర్తించాలని కోరారు.

రాష్ట్రంలో తెరాస అనాలోచిత విధానాలు, అవినీతి, గడీల పాలనకు వ్యతిరేకంగా భాజపా ఉద్యమిస్తుంది. తెరాసను ఎదుర్కోనే దమ్మున్న పార్టీ భాజపానే. ఖమ్మం నగరపాలికకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చారని ఆర్టీఐకి ఓ లెటర్ ఇస్తే 55 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మరీ ఆర్థికసంఘం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి. ఖమ్మంకు రావాల్సిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి. నిధులిచ్చే ప్రభుత్వానికి ఓటేస్తేనే ఖమ్మం అభివృద్ధి సాధ్యం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.