ETV Bharat / state

అధిష్ఠానానికి విధేయుడు, జనం మెచ్చిన నాయకుడు - తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Bhatti Vikramarka Biography : ఆయన కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్‌ భావజాలం. సాధారణ కార్యకర్త నుంచి అధిష్ఠానానికి విధేయతగా ఉంటూ తనదైన శైలిలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతా గణంలో ముఖ్యుడు భట్టి విక్రమార్క. తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకునేందుకు రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేతగా భట్టి చేసిన కృషి విస్మరించలేం. దళిత నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టిన ఆయన, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటవుతున్న తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక అవకాశం దక్కించుకున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైన మొక్కవోని దీక్షతో పనిచేసిన భట్టి విక్రమార్క పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Congress Government Formation in Telangana
Bhatti Vikramarka Biography
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 2:29 PM IST

Updated : Dec 7, 2023, 2:46 PM IST

Bhatti Vikramarka Biography : సాధారణ కార్యకర్త నుంచి సీఎల్పీ నేతగా అంచెలంచెలుగా ఎదిగిన మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్వస్థలం, ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురం. 1961 జూన్ 15న జన్మించిన ఆయన కాంగ్రెస్‌ వారసత్వాన్ని తల్లిదండ్రుల నుంచే పుణికి పుచ్చుకున్నారు. రాజకీయ ప్రస్థానాన్ని హస్తం పార్టీతోనే ప్రారంభించారు. ఎంఏ చదివిన విక్రమార్క 1992 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు.

2000 వరకు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న భట్టి విక్రమార్క, 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. పీసీసీ సెక్రటరీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపికైంది మొదలు, ఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకుడిగా సాగుతున్నారు. 2009లో సీపీఐ కంచుకోటగా ఉన్న మధిరలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు భట్టి విక్రమార్క. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా 2023 లోనూ నాలుగోసారి విజయ దుందుభి మోగించారు.

'పీపుల్స్‌ మార్చ్‌' పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర

Bhatti Vikramarka Sworn in Minister : కాంగ్రెస్ అధిష్టానం 2015లో భట్టి విక్రమార్కను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించింది. 2018 ప్రతిపక్ష నేతగా భట్టి అసెంబ్లీలో ప్రజా గొంతుకగా ప్రశ్నలు ఎక్కుపెడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. 2014 వరకు శాసన ఉపసభాపతిగా పని చేసిన ఆయనను, 2019 జనవరి 18న తెలంగాణ సీఎల్పీ నేతగా ఏఐసీసీ ప్రకటించింది. 2023లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉన్న విక్రమార్క పీపుల్స్‌ మార్చ్ (Peoples March) ద్వారా ప్రజలకు తామున్నామని అభయహస్తం ఇవ్వడంలో తనదైన మార్క్‌ కనబరిచారు.

Congress Take Oath in LB Stadium : కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావడంలో భట్టి విక్రమార్క కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయనకు ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కింది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయ ఢంకా మోగించిన భట్టికి దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, దళితుల హక్కుల కోసం పోరాడి విశేషంగా కృషి చేశారన్న గుర్తింపు ఉంది.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు - సీఎం తొలి సంతకం దానిపైనే!

పార్టీ నుంచీ ఎంతో మంది వెళ్లినా... ఎన్ని వైఫల్యలు ఎదురైనా...దృఢ నిశ్చయంతో ముందుకెళుతూ... నేడు కాంగ్రెస్‌ సర్కారుని కొలువదీర్చడంలో భట్టి పాత్ర కీలకం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటవుతున్న తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయన కేబినెట్‌లో భట్టి విక్రమార్క అను నేను అంటూ అమాత్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఓడించలేరు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka fires on BRS : 'దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం'

Last Updated : Dec 7, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.