ETV Bharat / state

బీరోలు సహకార ఎన్నికలు ముగిశాయి

author img

By

Published : Feb 17, 2020, 11:37 PM IST

ఖమ్మం జిల్లా బీరోలు సహకార సంఘం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​గా రామసహాయం నరేష్ రెడ్డి, రమేశ్​ ఎన్నికయ్యారు. అన్ని స్థానాలు తెరాస గెలిచినప్పటికీ... రెండు వర్గాలుగా విడిపోవడం వల్ల ఎన్నిక నేటికి వాయిదా పడింది.

beerolu coperative socitey chairmen election complete
ముగిసిన బీరోలు సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు సహకార సంఘం ఛైర్మన్, వైస్​ ఛైర్మన్​ ఎన్నికలు పోలీసు బందోబస్తుతో నిర్వహించారు. 13 వార్డులకు గానూ... అన్నింటినీ తెరాస మద్దతుదారులు గెలుచుకున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గం 4 వార్డులు, తెరాస జిల్లా నాయకుడు రామరెడ్డి వర్గం 9 వార్డులు దక్కించుకున్నారు.

ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదంతో... ఆదివారం జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. స్వల్ప ఉద్రిక్తత మధ్య నిర్వహించిన ఎన్నికలో... రామస్వామి నరేష్ రెడ్డి ఛైర్మన్​గా, రమేశ్​ వైస్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. నిజమైన తెరాస పార్టీ గెలిచిందని, కేసీఆర్​ పుట్టినరోజు బహుమతిగా ఇస్తామని ఛైర్మన్​ రామస్వామి నరేష్ రెడ్డి అన్నారు.

ఇవీచూడండి: ఆ కళాశాలలపై చర్యలెందుకు తీసుకోలేదు: హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.