శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఖమ్మం జిల్లా తల్లాడలో వైభవంగా సాగింది. సహకార కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పడిపూజలో పదునెట్టాంపడిపై కర్పూర హారతులు వెలిగించి పూజలు నిర్వహించారు. అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
హైదరాబాద్కు చెందిన గంగిరెడ్డి భజన బృందం ఆధ్వర్యంలో గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. దేవతామూర్తుల వేషధారణలో పలువురు ఆకట్టుకున్నారు. నిర్వాహకులు పెరిక నాగేశ్వరరావు, మొక్క బసవయ్యలు 18వ సారి మాల దీక్ష పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వివిధ మండలాల గురుస్వాములను ఘనంగా సన్మానించారు. వేదపండితులు గుడిపాటి ప్రసాద్ శర్మ పడిపూజ క్రతువు కొనసాగించారు.
వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం - అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం కన్నులపండువగా సాగిన ఈ పూజలో స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో ప్రాంతమంతా మార్మోగింది.
శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఖమ్మం జిల్లా తల్లాడలో వైభవంగా సాగింది. సహకార కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పడిపూజలో పదునెట్టాంపడిపై కర్పూర హారతులు వెలిగించి పూజలు నిర్వహించారు. అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
హైదరాబాద్కు చెందిన గంగిరెడ్డి భజన బృందం ఆధ్వర్యంలో గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. దేవతామూర్తుల వేషధారణలో పలువురు ఆకట్టుకున్నారు. నిర్వాహకులు పెరిక నాగేశ్వరరావు, మొక్క బసవయ్యలు 18వ సారి మాల దీక్ష పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వివిధ మండలాల గురుస్వాములను ఘనంగా సన్మానించారు. వేదపండితులు గుడిపాటి ప్రసాద్ శర్మ పడిపూజ క్రతువు కొనసాగించారు.
Body:wyra
Conclusion:8008573680