కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వాహన చట్టంను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. దేశంలో పేదలను వాహన రంగంలో ఉన్న కార్మికులను నడ్డివిరిచే ఈ చట్టం ఎందుకు ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఇవీచూడండి: అసోం: ఎన్ఆర్సీలో ప్రముఖుల పేర్లు గల్లంతు