ETV Bharat / state

"పోతిరెడ్డి పాడు వల్ల.. దక్షిణ తెలంగాణ ఎడారే" - 'Pothireddypadu project Latest News

తెదేపా అధినేత చంద్రబాబుపై కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను తెతెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ ఖండించారు. పోతిరెడ్డిపాడు పై ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు.

at-a-meeting-held-at-khammam-tdp-district-office
"పోతిరెడ్డి పాడు వల్ల.. దక్షిణ తెలంగాణ ఎడారే"
author img

By

Published : May 20, 2020, 1:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తర తెలంగాణ ప్రజలపై భారం మోపారని తెతెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఖమ్మం తెదేపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుపై కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచితే తాము మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడమని గుర్తు చేశారు.

కేసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తును నాలుగడుగులు తగ్గించడం వల్ల... 600 మీటర్ల ఎత్తు పోయాల్సి వస్తోందని వెల్లడించారు. ఇప్పుడు నీళ్లు పారుతున్న భవిష్యత్తులో దాన్ని భరించడం కష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు పై ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.