ETV Bharat / state

మూడు నెలలుగా అందని ఆసరా పింఛన్లు.. ఇబ్బందులుపడుతున్న లబ్ధిదారులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసరా పింఛన్‌ లబ్థిదారులకు 3 నెలలుగా నిరీక్షణ తప్పడం లేదు.  పింఛను సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అందించే ఆసరా సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు.. డబ్బులు రాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేక తల్లడిల్లిపోతున్నారు..

author img

By

Published : Nov 12, 2022, 4:18 PM IST

ASARA
ASARA
ఖమ్మంలో మూడు నెలలుగా అందని ఆసరా పింఛన్లు.. ఇంకా దిగిరాని సర్కార్​

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసరా లబ్ధిదారులకు 3 నెలలుగా పింఛన్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, నేత కార్మికులకు పింఛను అందిస్తోంది. ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకూ ఆసరా అందుతోంది. సర్కారు ఇచ్చే పింఛను సొమ్ము ఎంతోమందికి ఆర్థికంగా అండగా ఉంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల 17 వేలకు పైగా ఆసరా లబ్ధిదారులు ఉన్నారు.

సరైన సమయంలో పింఛన్‌ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పింఛను లబ్ధిదారులకు డబ్బులు నేరుగా ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం ఆన్‌లైన్‌ చేసింది. సాధారణంగా పింఛన్‌ సొమ్ము నెల నెల చివరి వరకూ ఖాతాల్లో జమవుతుంది. అయితే గత మూడు నెలలుగా డబ్బు జమ కాకపోవంతో ఆసరా సొమ్ముపైనే ఆధారపడి ఉన్న లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలలుగా పింఛన్లు అందకపోవడంతో ఆ డబ్బులపైనే ఆధారపడి ఉన్న వృద్ధులు, వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

ఆగస్టు నెల చివరన అందాల్సిన పింఛను ఇప్పటి వరకూ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక ఇక్కట్లు పడుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పింఛను సొమ్ముపై ఆరా తీస్తున్నారు. ఇంకా రాలేదన్న సమాధానంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్లు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. నిధులు రాకనే ఆలస్యమైందని.. త్వరలోనే సొమ్ము జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.