రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన గొల్లగూడెంలోని సాయిబాబా ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి పదవి రావాలంటూ తాను సాయిబాబాను మొక్కుకున్నట్లు తెలిపిన ఆయన...త్వరలోనే షిర్డీ వెళ్తానని తెలిపారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?