ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. అక్రమంగా లంచం తీసుకుంటున్న కంప్యూటర్ ఆపరేటర్, అందుకు ప్రోత్సహించిన వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. గొల్లపూడి గ్రామానికి చెందిన వేణుమాధవ్ అనే వ్యక్తి.. తన భార్య పేరుతో ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్డు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నమోదు చేయకపోగా గొల్లపూడి వీఆర్వో కశ్యప్, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి రూ. రెండు వేలు డిమాండ్ చేశారు. రూ.1500కు బేరం కుదుర్చుకున్నారు.
చరవాణి ద్వారా వారి సంభాషణను రికార్డు చేసిన దరఖాస్తుదారు.. ఏసీబీని ఆశ్రయించారు. ఆ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌కు లంచం ఇస్తుండగా పథకం ప్రకారం పట్టుకున్నట్టు వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఇదీ చూడండి:- యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!