ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన మద్యం దుకాణాలను అబ్కారీ అధికారులు సీజ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నిబంధనలు అతిక్రమించినందుకు... రెండు మద్యం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. యజమానులపై కేసులు నమోదు చేశారు. అయితే అధికారులు వేసిన తాళాలు పగులగొట్టి మద్యం దుకాణ యజమానులు యథావిధిగా విక్రయాలు ప్రారంభించారు.
సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు అక్కడికి చేరుకోగా దుకాణ యజమానులు వాగ్వాదానికి దిగారు. కక్షపూరితంగానే సీజ్ చేశారని ఆరోపించారు. మరోసారి వివరాలు పరిశీలించిన అధికారులు మద్యం దుకాణాలను మళ్లీ సీజ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి రానున్న 2.7లక్షల వ్యాక్సిన్లు.. బెడ్ల కొరత లేదన్న ఈటల