ETV Bharat / state

ప్రేమించడమే పాపమైంది... యువకుడి పాలిట మృత్యు పాశమైంది.. - తెలంగాణ నేర వార్తలు

Khammam sad love story: ప్రేమించినందుకు ఓ యువకుడి నిండు ప్రాణం బలైపోయింది. గత నాలుగేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్న ఆ జంట పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దవారిని సంప్రదించారు. ఈ వివాహం ఇష్టంలేని యువతి తండ్రి.. ఆయన బంధువులతో కలిసి యువకుడిపై దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 9, 2023, 5:26 PM IST

Khammam sad love story: ప్రేమించడమే ఆ యువకుడికి ప్రాణ గండంగా మారింది. ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన కూతురు ప్రేమ వ్యవహారం నచ్చని యువతి తండ్రి ఆయన బంధువులు యువకుడిని తీవ్రంగా గాయపరిచి మరణానికి కారణమయ్యారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేశ్​(25) సమీప బంధువు అయిన చింతకాని మండలం చిన్న మండల గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు.

ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిపారు. కానీ యువతి తండ్రికి ప్రేమ వివాహం నచ్చలేదు. ఈ నెల మూడో తేదీన యువతి తండ్రి ఖమ్మం నగర సమీపంలోని పెద్ద తండా వద్ద యువకుడితో మాట్లాడేందుకు పిలిచి దాడి చేశాడు. మరి కొంతమంది బంధువులతో కలిసి తీవ్రంగా చావబాదారు

వెంకటేష్​కు తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం యువకుడు మృతి చెందాడు. ప్రేమించిన అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు.. యువతి తండ్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

"వెంకటేశ్​ ప్రేమ విషయం రెండు కుటుంబాలలో తెలుసు. వివాహం జరిపించాలని యువతి యువకుడు ఇరు కుటుంబాలతో మాట్లాడారు. కానీ యువతి తండ్రికి ఈ ప్రేమ వివాహం ఇష్టంలేదు. మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో యువతి తండ్రి ఖమ్మం నగర సమీపంలోని పెద్ద తండా వద్దకు యువకుడితో మాట్లాడేందుకు పిలిపించుకుని బంధువులతో కలిసి దాడి చేశాడు. యువకుడు చాలా మంచివాడు. ప్రేమించిన అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు.. యువతి తండ్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నిందితులని కఠినంగా శిక్షించి యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలి ". -మృతుడి బంధువులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.