ఇవీ చదవండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్
విశ్రాంత పోలీసు ఇంట్లో దొంగతనం - CHORI
ఇంట్లో ఎవరూ లేకపోతే సరి. ఆ ఇల్లు ఎవరిదైనా సరే కన్నం వేసే వరకు ఊరుకోరు. ఇంట్లో ఉన్నవన్ని దోచుకొని ఇళ్లుని గుళ్ల చేస్తారు. తాజాగా విశ్రాంత పోలీసు ఇంట్లోనే దాదాపు 9 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు.
పోలీసు ఇంట్లో దొంగతనం... 30 తులాల బంగారం చోరీ
పట్టపగలే విశ్రాంత ఎస్సై ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాదాపు 9 లక్షల రూపాయల విలువ చేసే 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు గుర్తుతెలియని దుడంగలు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని సుందరయ్య నగర్లో చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగివచ్చే సరికి దొంగతనం జరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ ప్రసన్నకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్
sample description