కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంపై కరోనా ప్రభావం పడింది. ఐదో సారి ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి కూడా సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జడ్పీ ఛైర్‌పర్సన్ విజయ ప్రకటించారు. జడ్పీటీసీ సభ్యులతో పాటు జిల్లా పరిషత్‌లోని ఏడుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు విజయ తెలిపారు.
కరోనా సోకిన వారందరు హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఒక దఫా కరోనా పరీక్షలు నిర్వహించామని.. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కోరినట్లు వివరించారు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్