ETV Bharat / state

'కవితను పార్టీ మారమన్నారని కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారు' - Sharmila fires on kavitha latest news

YS Sharmila Fires On KCR: లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను తప్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవటంతో కేసీఆర్‌ కొత్త నాటకానికి తెర లేపారని వైఎస్ షర్మిల ఆరోపించారు. లిక్కర్‌ స్కాంలో అరెస్టులు చేస్తే పార్టీలో చేరనందుకని చెబుతారేమోనని ఎద్దేవా చేశారు.

YS Sharmila Fires On kcr
YS Sharmila Fires On kcr
author img

By

Published : Nov 16, 2022, 9:16 PM IST

YS Sharmila Fires On KCR: రాష్ట్రంలో భూకబ్జాలు, కమీషన్లతో ఎమ్మెల్యేలు యథాలీడర్ తథా క్యాడర్‌లా తయారయ్యారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌, ముంజపల్లి, మానకొండూరు, ఈదులగుట్టపల్లిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు సమస్యలు విన్నవిద్దామంటే ఎమ్మెల్యే కనబడటం లేదని విమర్శించారు. పోలీసులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనను నియోజకవర్గానికి తీసుకురావాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌ కళాకారుడుగా ఎంతో మంచి పేరుండేదని.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఇప్పుడు కళాకారుడు కాస్తా రౌడీగా మారాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌కు నీళ్లు తీసుకుపోతే.. తాను మాత్రం తక్కువనా అన్నట్లు ఎమ్మెల్యే రసమయి తన ఫామ్‌హౌజ్‌కు కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్లాడని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఇరుకున్న కవిత కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు కేసీఆర్‌ కొత్త కథ అల్లుతున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్‌ స్కాంలో అరెస్ట్​లు చేస్తే పార్టీలో చేరనందుకని చెబుతారేమోనని వ్యంగాస్త్రాలు సంధించారు. అదే నిజమైతే నలుగురు ఎమ్మెల్యేల గురించి చెప్పినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదని సీఎం కేసీఆర్​ను వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

"ఉద్యమం అప్పుడు 500మంది గొంతు చించుకొని పాటలు పాడారు. వారికి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌కు కట్టుకుంటే.. నేను మాత్రం తక్కువనా అన్నట్లు ఎమ్మెల్యే రసమయి ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు కాళేశ్వరం నీళ్లు తీసుకుపోతుంటే.. ఎమ్మెల్యే కూడా కాలువలు తీయించి నీరు తీసుకువెళ్తున్నారు. కంటే కూతురుని కనాలని మళ్లీ కొత్త సినిమాకు కేసీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. కేసీఆర్ చెబుతున్నారు నా కూతురుని భాజపా వాళ్లు కొనాలని చూస్తుంది కానీ ఆమె అమ్ముడు పోలేదు. కనుక భాజపా వాళ్లు నా కూతురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కథ అల్లుతున్నారు." -వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

అసలేం జరిగిదంటే: నిన్న జరిగిన తెరాస సమావేశంలో దేశానికి భాజపా రూపంలో పట్టిన చెదలును తొలగించే బాధ్యతను తెరాస శ్రేణులు తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ తనలా పని చేయాలని తెరాస నేతలకు సీఎం సూచించారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరమని భాజపా అడిగిందని.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని సీఎం కేసీఆర్ చెప్పారు.

'కవితను పార్టీ మారమన్నారని కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారు'

ఇవీ చదవండి: 'పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకనే మాపై ప్రభుత్వం దాడులు'

ముందస్తు ఉండదు.. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

దిల్లీ మద్యం కుంభకోణంతో శరత్‌ చంద్రారెడ్డి భార్యకు సంబంధం ఉందా..?

తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.