కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఎంబీఏ కళాశాలలో ఈనెల 25, 26న యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రధాన కార్యదర్శి గండ్ర శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
యూత్ ఫెస్టివల్లో డాన్స్, మ్యూజిక్, డ్రామా, మిమిక్రీ, కామెడీ, ఫోటో కాంటెస్ట్ పోటీలను నిర్వహించనున్నట్టు నిర్వహాకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రు.4 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.2 వేల చొప్పున రూ.లక్ష ప్రైజ్ మనీని అందజేయనున్నట్టు వివరించారు.
ఫెస్టివల్లో పాల్గొనడానికి ఈ నెల 22లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 మంది నమోదు చేసుకున్నారని మరో 200 మంది నమోదు అయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.