యువజన కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్‌రెడ్డిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దూషించడాన్ని యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగశేఖర్ ఖండించారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మానకొండూర్ నియోజకవర్గంలో సమస్యలపై ప్రశ్నించినందుకు ఫోన్లో బెదిరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి వారి వల్లే ఎస్సీ, ఎస్టీ చట్టాలు దిగజారిపోతున్నాయని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డికి యువజన కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటారని ఆయన తెలిపారు.