కరీంనగర్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాపారస్థులు తమ తమ దుకాణాల్లో లక్ష్మీ దేవికి పూజలు చేశారు. అలాగే జిల్లాలో అనాదిగా వస్తున్న సమాధుల పూజ సంప్రదాయాన్ని కరీంనగర్ వాసులు భక్తి శ్రద్ధలతో పాటించారు.
పితృ దేవతలను స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పూజలు చేస్తుంటారు. సమాధులకు సున్నాలు వేసి పూలతో అలంకరించారు. దీపాలు వెలిగించి టపాసులు పేల్చి వినూత్న పద్ధతిలో పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: మనవడితో కలిసి టపాసులు కాల్చిన మంత్రి