కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సమాజాన్ని తీర్చిదిద్దడంలో తల్లిగా మహిళలదే కీలక బాధ్యత అని కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళా పెట్రోలింగ్ వాహనాలతో పాటు బ్లూకోట్స్, క్యూఆర్ టీంలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కళాశాల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మహిళలు అన్నింటా ముందుకు సాగాలంటే పురుషుల సహకారం తప్పనిసరని... తన తండ్రి, భర్త, పిల్లల సహకారంతోనే ఈ స్థాయికి చేరినట్లు అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. మహిళలు శారీరకంగా మానసికంగా ధృడంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించేందుకు వీలు పడుతుందని ఆమె సూచించారు.
ఇవీ చదవండి: ఉద్యోగంతోనే మాకు గుర్తింపు