కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్యాంపు కార్యాలయంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి విషయంలో ఒకటో వార్డు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తాగునీటి సరఫరా సమస్యపై మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించటంలేదని, విద్యుత్తు సమస్యలు పరిష్కరించటంలేదని ఆరోపించారు. మహిళలకు నచ్చజెప్పి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శాంతింపజేశారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీనిచ్చారు.