కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన సామల లక్ష్మీ విషజ్వరంతో మృతి చెందింది. గత నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి నాలుగు యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. ఆరోగ్యం విషమించడం వల్ల మృతి చెందింది. లక్ష్మీ మృతి ఆమె కుటుంబంలో విషాదం నింపింది.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: ల్యాండర్ ఆచూకీ లభ్యం.. కానీ..