ETV Bharat / state

హుజూరాబాద్​లో విజిలెన్స్​ తనిఖీలు - విజిలెన్స్​ అధికారుల దాడి

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలోని పలు మండలాల్లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్​, జమ్మికుంట, మండలాల్లోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు చేశారు.

Vigilance Officers Inspection In Huzurabad Town
హుజూరాబాద్​లో విజిలెన్స్​ తనిఖీలు
author img

By

Published : May 30, 2020, 4:13 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్​, జమ్మికుంట మండలాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. బృందాలుగా ఏర్పడి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనాల నిల్వలు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. దుకాణ యజమానుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్​ నిల్వలను ఎప్పటికప్పుడు రిజిష్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు.

రైతులకు ఎరువులు మాత్రమే అందించాలని.. విత్తనాలు అమ్మరాదని సూచించారు. ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలు మాత్రమే అమ్మాలని ఆదేశించారు. వానకాలం పంట సీజన్​ ప్రారంభం కానుండడం వల్ల ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తనిఖీలకు వస్తున్నారని సమాచారం అందుకున్న కొందరు యజమానులు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.