వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బంధువు మృతి చెందాడని ఆరోపిస్తూ కరీంనగర్‌లోని మెడికవర్ ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.
పెద్దపల్లికి చెందిన సయ్యద్ తస్లీమ్ అహ్మద్ ముూడు రోజుల క్రితం ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అసిడిటీ సమస్య ఉందని చెప్పిన వైద్యులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంజోగ్రామ్ చేసి స్టంట్ వేశారని బంధువులు తెలిపారు. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్టంట్ వేయడం వల్లే అహ్మద్ మృతిచెందినట్ బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: 'ఆ డాక్టరు దగ్గరికెళితే రహస్య ప్రదేశాల్లో తడుముతున్నాడు'