వైద్యం కోసం వచ్చిన మహిళను రహస్య ప్రదేశాల్లో తాకడమే కాకుండా.. అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు కటకటాల పాలైన ఘటన పాతబస్తీ చాంద్రాయణ గుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడలో జరిగింది. అహ్మద్రాహి... బీఏఎంఎస్ డాక్టర్‌గా బండ్లగూడలో క్లినిక్ నడిపిస్తున్నాడు. ఈనెల 16న అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం భర్తతో కలిసి అతని క్లినిక్‌కు వచ్చింది. చెకప్ చేస్తానంటూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా... రహస్య ప్రదేశాల్లో తాకాడంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయమై తన భర్తతో కలిసి ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు