హుస్సేన్సాగర్లో దూకి ఓ తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి రాణి మృతి చెందగా... కుమారుడు హీరానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి అనే మహిళ కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. రాణి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. వ్యాపారంలో నష్టపోయి మానసిక వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాత్రి 10 గంటలకు చోటుచేసుకున్నట్లు తెలిపారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 2018లో ఆర్టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం