మృతి చెందిన ఆర్టీఏ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ మైక్రో చిప్‌లు, ఆర్సీలు తయారు చేస్తున్న 9 మంది గల ముఠా లోని 6 మందిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 27 పీవీసీ కార్డులు, నకిలీ ఆర్సీలు, వాటిని తయారు చేసే యంత్రం, ప్రింటర్ మానిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో దక్షిణ మండలం ఆర్టీఏ అధికారిగా పనిచేసిన నీల్ విక్టర్ 2018లో మరణించారు. ఆయన సంతకంతో ఫోర్జరీ అయిన ఒక వాహన ఆర్సీ.. యజమాని బదలాయింపునకు దక్షిణ మండలం బండ్లగూడలో ఉన్న ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తుకు వచ్చింది. 2019లో తయారైన ఆర్సీని పరిశీలించిన అధికారులు 2018లో మరణించిన అధికారి సంతకం చూసి అవాక్కయ్యారు. ఏదో మోసం జరుగుతోందని.. గుర్తించిన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో దక్షిణ మండలం ఆర్టీఏ అధికారి సదానందం ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దళారులను విచారించి అసలు ముఠాను పట్టుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌కు చెందిన ఆఫ్రోజ్ ఆర్టీఏ ఏజెంట్... మరో 8 మందితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 6 నెలల నుంచి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీలు లేని, సీజైన, యజమాని లేని, వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: వరకట్నం కోసం వేధింపులు.. గర్భవతి ఆత్మహత్య