ETV Bharat / state

'సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు'

కేంద్ర ప్యాకేజీల్లో సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటి కూడా లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. విమానరంగాల్లో సంస్కరణల వల్ల పేదలకు ప్రయోజనమేంటని ప్రశ్నించారు.

vinod kumar about central package
'సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు'
author img

By

Published : May 17, 2020, 5:20 PM IST

Updated : May 17, 2020, 7:05 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగపడేవిధంగా లేదని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ వరుసగా ప్రకటిస్తున్న ప్యాకేజీలు బడ్జెట్​ను తలపిస్తున్నాయని మండిపడ్డారు.

"ప్రజలు తిరగని సమయంలో విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ప్రకటించడం ఏంటి? విమానరంగంలో సంస్కరణల వల్ల పేదలకు ప్రయోజనం ఉంటుందా? కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీల్లో సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు. ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదు."

-వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

కరోనా నేపథ్యంలో చాలా దేశాలు జీడీపీలో 15శాతం వరకు రాష్ట్రాలు, ప్రజలకు సహాయం చేశాయని వివరించారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థికంగా చితికిపోయిందన్నారు.

'సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు'

ఇవీ చూడండి: మాటసాయం... ఇస్తోంది మనసుకు సాంత్వనం

Last Updated : May 17, 2020, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.