కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని ధర్మగుండంలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కొద్దిరోజులుగా ధర్మగుండంలో పేరుకుపోయిన చెత్తతో ఆలయ పరిసరాలన్నీ దుర్వాసన చెలరేగుతుంది. దీనిపై స్పందించిన ఆలయ కమిటీ ధర్మగుండం పరిశుభ్రతకు పూనుకున్నారు. 300 మంది కార్మికులతో చెత్త, పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నారు. భక్తులు స్నానాలు చేసేందుకు ఆలయం యంత్రాంగం నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: కాళేశ్వరంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం