కరోనా నివారణలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఉండడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వలస కార్మికులు, కూలీలు పనులు లేకపోవడం వల్ల పూటగడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన కరీంనగర్లోని 15వ వార్డు కార్పొరేటర్ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలను పంపిణీ చేశారు.
లాక్డౌన్ ముగిసే అంతవరకు ఎవరు బయటకు రావొద్దని ఆయన కోరారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.