నిత్యం ప్రజల మధ్య ఉంటూ అత్యవసర సేవలు అందిస్తున్న వారికి వాక్సినేషన్ (Vaccination) స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) అన్నారు. సూపర్ స్ప్రెడర్లకు (Super spreaders) కరీంనగర్‌లోని ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో టీకా పంపిణీ ప్రారంభించారు. అనునిత్యం నిరుపేదల అవసరాల్ని తీర్చి ప్రతి నెల నిరుపేదలకు రేషన్ అందించే రేషన్ డీలర్లు, ప్రతి ఇంటికి వంట గ్యాస్ అందించే ఎల్పీజీ డీలర్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారికి టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 794 ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు, 3,279పెట్రోల్ బంకుల్లో పనిచేసే 49 వేల మందికి, షాపునకు ఇద్దరు చొప్పున 15 వేల రేషన్ షాపుల్లోని 33 వేల మందికి, సివిల్ సప్లైస్ లోని 83 వేల మందికి వాక్సినేషన్ (Vaccination) అందిస్తోందని అన్నారు. తద్వారా నిరంతరం ప్రజాసేవ చేసే వీరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవలందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) వివరించారు.