family in elusive disease in Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన వేముల ప్రశాంత్, మమత కుటంబానికి.. అంతు చిక్కని వ్యాధి శాపంగా మారింది. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మరణించారు. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాధంలో మునిగిపోయింది. ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రశాంత్, ఆయన భార్య మమత.. పిల్లలతో ఉన్నంతలో పిల్లలుతో గడుపుతూ.. సంతోషంగా ఉండేవారు. అంతలోనే ఆ కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
గతనెల 29న కొడుకు అద్వైత్‌కు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు చెడిపోవడంతో.. లక్షలు ఖర్చుచేసి చికిత్స చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. తీవ్ర అనారోగ్యానికిగురై అద్వైత్ చనిపోయాడు. ఆ దుఃఖాన్ని దిగముంగకముందే.. మరో 15 రోజుల్లో కూతురు అమూల్య అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అద్వైత్ మాదిరిగానే చికిత్స చేయించినా ఫలితం లేకుండాపోయింది. అమూల్య స్పల్ప వ్యవధిలోనే మృతిచెందింది.
ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నవాళ్లను కాపాడుకునేందుకు ఆస్పత్రులకు లక్షలు ఖర్చు చేసినా దక్కలేదు. ఇటీవలే ప్రశాంత్ భార్య మమత అదే తరహాలో అనారోగ్యం పాలైంది. ఇప్పటికే ఆస్పత్రుల కోసం వెచ్చించిన లక్షలు ఆ కుటుంబానికి పెనుభారంగా మారాయి. వైద్యం కోసం చేసిన ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన దాతలు లేదా ప్రభుత్వం ఆదుకోవాలని ఆ కుటుంబీకులు కోరుతున్నారు.
"మా పిల్లలు పుట్టినప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకొని వెళ్లిన తరువాత వారి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో వారి వైద్యం కోసం సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేశాం."-వేముల శ్రీకాంత్, తండ్రి
"మా బాబు చనిపోయిన 15 రోజులు తర్వాత మా కూతురు కూడా చనిపోయింది. అనుకోకుండా వాంతులు, విరోచనలతో ఆసుపత్రికి తీసుకెళ్లాం.. వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాం. వారికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశాం. అయినా ఫలితం లేక పోయింది. నాకు కూడా అదే సమస్యతో బాధపడుతున్నాను. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం".-వేముల మమత, తల్లి
ఇవీ చదవండి: