తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులకు మద్దతుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ