మిడ్ మానేరు జలాశయం అవకతవకలపై చర్చలకు సిద్ధమని తెరాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పరం సవాలు విసురుతున్నారు. తెరాస నేత, ఐడీసీ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. మధ్య మానేరు నాణ్యత లోపాలపై కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. గతంలో ఈ ప్రాజెక్టును కాంట్రాక్ట్ తీసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌తో కలిసి చర్చకు రావాలని ఈద శంకర్ రెడ్డి సవాల్ విసిరారు. స్పందించిన పొన్నం ప్రభాకర్... ఈద శంకర్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మిడ్‌మానేరుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు... ఈద శంకర్ రెడ్డితో పాటు మరికొందరు తెరాస ఎమ్మెల్యేలు కూడా రావాలని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి: "ఇండియాకు సాఫ్ట్వేర్.. చైనాకు హార్డ్‌వేర్ బలం అవసరం"