పార్లమెంటు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తెరాస పార్టీ నేడు కరీంనగర్లో మొట్టమొదటి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనుంది. నేటి నుంచి ఈనెల 17వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి7న వరంగల్, భువనగిరిలో, 8న మెదక్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో సన్నాహాక సభలు జరగనున్నాయి. మార్చి 9న నాగర్ కర్నూలు జిల్లాలోని వనపర్తిలో, అదే రోజు మధ్యాహ్నం చేవెళ్లలో జరగనున్నాయి. 13న జహీరాబాద్లోని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద, అదే రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్లో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 14న నిజామాబాద్, ఆదిలాబాద్, 15న రామగుండంలో పెద్దపల్లి సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 16న మహబూబాబాద్, ఖమ్మం. 17న నల్గొండ, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో పార్లమెంటు సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు.
అక్కడే ఉంటూ... అన్నీ చూసుకుంటూ
ఈ సమావేశాలన్నింటిలోనూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొననున్నారు. రాత్రి అక్కడే బస చేసి ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. ఖమ్మం, మహబూబాబాద్ సమావేశాలను స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తారు.
ఇవీ చదవండి:"అది ప్రభుత్వ ప్రకటనే"