కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. రవిశంకర్ ఆస్తులు కూడబెట్టాడని నిరూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రవిశంకర్‌పై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్