కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని... మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కోరారు.
కార్యక్రమానికి హాజరైన తెరాస నాయకులు ప్రతిమ వైద్య కళాశాలలోని తలసేమియా బాధితుల కోసం రక్తదానం నిర్వహించారు. తన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు రక్తదానంతో పాటు మొక్కలు నాటి హరితహారంలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.